7, డిసెంబర్ 2010, మంగళవారం

ఊహలకే రెక్కలు వస్తే ....




ఊహలకే రెక్కలు వస్తే నేనెగిరిపోతా ఈ లోకాన్ని వదిలి..
నా చెలిమి చెంతకు సేదతీరడానికి
మనసులో గూడుకట్టుకున్న ఊసులన్నీ వినిపించడానికి
అమ్మ వలే తను నాకు లాలి పాట పాడుతుంటే
తన ఒడిలో వెండి వెన్నెల్లో హాయిగా నిదురించడానికి ..

నేను కూడా నా గొంతు కలుపుతా నా హృదయగీతాన్ని వినిపించడానికి
ఎన్నో ఏళ్ళ నుండి దాచుకున్న నా అలోచనలు
భావుకత్వమై జాలువారుతుంటే నీకు అంకితమివ్వడానికి..

నేనెగిరిపొతా ఈ లోకాన్ని వదిలి నా ఊహలకే రెక్కలు వస్తే
నీ ఒడిలో ఊహల్లో నా ఊసులు వినిపిస్తూ నిదురిస్తా..

7 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

బాగుందండి. మీ ఊహలకి రెక్కలు రావాలని కోరుకుంటున్నాను.

వెన్నెల్లో ఆడపిల్ల చెప్పారు...

ధన్యవాదాలు

నందు చెప్పారు...

నిజంగా మన ఊహలకి రెక్కలొచ్చి అలా అలా ఎగిరిపోతే ఎంత భావుంటుందో.......
మరో ప్రపంచం లోకి...నందు...

రసజ్ఞ చెప్పారు...

బాగుందండి. కోరికలే గుఱ్ఱాలు అయితే ఊహలకే రెక్కలు వస్తే అన్నా పాట ఉండనే ఉంది కదా!

వెన్నెల్లో ఆడపిల్ల చెప్పారు...

@నందుగారు @రసజ్ఞగారు ధన్యనాదాలు ..
అనునా ఆ సామెత విన్నాను కాని పాట వుందని తెలీదు నాకు.

Ennela చెప్పారు...

బాగుందండీ.. మీ ఊహలకి తొందరగా రెక్కలు రావాలని కోరుకుంటున్నా... ఆల్ ద బెస్ట్

వెన్నెల్లో ఆడపిల్ల చెప్పారు...

:-)