
ఊహలకే రెక్కలు వస్తే నేనెగిరిపోతా ఈ లోకాన్ని వదిలి..
నా చెలిమి చెంతకు సేదతీరడానికి
మనసులో గూడుకట్టుకున్న ఊసులన్నీ వినిపించడానికి
అమ్మ వలే తను నాకు లాలి పాట పాడుతుంటే
తన ఒడిలో వెండి వెన్నెల్లో హాయిగా నిదురించడానికి ..
నేను కూడా నా గొంతు కలుపుతా నా హృదయగీతాన్ని వినిపించడానికి
ఎన్నో ఏళ్ళ నుండి దాచుకున్న నా అలోచనలు
భావుకత్వమై జాలువారుతుంటే నీకు అంకితమివ్వడానికి..
నేనెగిరిపొతా ఈ లోకాన్ని వదిలి నా ఊహలకే రెక్కలు వస్తే
నీ ఒడిలో ఊహల్లో నా ఊసులు వినిపిస్తూ నిదురిస్తా..