17, ఫిబ్రవరి 2010, బుధవారం

ఆక్రందన




ఎవరిది ఆ ఆక్రందన?
నా మనస్సును తాకుతున్న ఆ ధ్వని నా చెవులనుంచి ఎలా తప్పించుకుంది..

ఏదో కోల్పోతాను అనే భాద తన గొంతుకలో..
ఏదో సాధించి తీరాలి అనే కసి తన చేతల్లో..
ఇంకేదో వుంటే సంపూర్ణమవుతాను అనే ఆవేదన తన కళ్లలో
ఒక వెర్రి గొంతుక పురివిప్పి నాట్యం చేస్తోంది
పిచ్చిపట్టిన దానిలా ఆగకుండా పాడుతోంది!

పాడుతూ అంతలా నాట్యం చెయ్యడం ఎవ్వరికైనా సాధ్యమా?
ఈ నిశీధి న్రుత్య ప్రహేలికకు అంతం ఎప్పుడో..!
నా ఈ వెర్రి గొంతుక అలసి ఆగేదెప్పుడో
అనుకున్నది సాధించినప్పుడా
లేక సాధించలేనని తీర్మానించినప్పుడా.....!!!!!!!